దీపికను గాడిద అన్న సుధీర్ ...హర్ట్ ఐన అనిల్ రావిపూడి!
on Dec 3, 2022
కామెడీ స్టాక్ ఎక్స్చేంజి షోలోకి అవినాష్, వేణు, యాదమ్మ రాజు, భాస్కర్-జ్ఞానేశ్వర్, హరి వచ్చారు. ఇక ఫైనల్ గా సద్దాం స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చారు. "హాయ్ సద్దాం ఎలా ఉన్నావ్" అని దీపికా అడిగేసరికి " నేను స్టేజి మీద ఉన్నా" అన్నాడు..."ఇప్పుడు నీ చార్ట్ వస్తుంది అప్పుడు చూద్దాం" అనేసరికి "చాటతో పాటు బియ్యం కూడా తీసుకురండి వండుకుందాం" అన్నాడు "నేను సద్దాంని హ్యాండిల్ చేయలేను నువ్వే చూసుకో" అని సుధీర్ అనేసరికి "గాడిద పని గాడిద చేయాలి..గుర్రం పని గుర్రం చేయాలి" అని దీపికా కౌంటర్ వేసింది.
దాంతో సుధీర్ "నేను గుర్రాన్ని కాబట్టి సైలెంట్ గా ఉంటాను..నువ్వు గాడిదవు కాబట్టి నువ్వే హ్యాండిల్ చెయ్యి" అని దీపికను గాడిదతో పోల్చాడు..ఆ మాటకు అనిల్ రావిపూడికి బాగా కోపమొచ్చేసింది. "నువ్వు గాడిదవి అని అనుకుంటేనే దీపికా నెక్స్ట్ స్టెప్ వేస్తుంది...లేదంటే లేదు" అని సీరియస్ గా చెప్పేసరికి "నేను గాడిదలా పక్కన ఉంటా..మీరు గుర్రంలా మీ పని చేయండి" అని సుధీర్ అనేసరికి ఎగిరి గంతేసింది దీపికా..
ఇక సద్దాం చార్ట్ చూస్తే 50 పర్శంట్ రచ్చ, 30 పర్శంట్ ట్రేండింగ్, 20 పర్శంట్ చిల్లర పంచులు, పిచ్చి పిచ్చి మేనరిజాలు అని చూపించేసరికి షాకయ్యాడు సద్దాం.
Also Read